Joint Option In EPFO: సమయం లేదు మిత్రమా.. ఈపీఎఫ్‌ఓలో జాయింట్ ఆప్షన్ ఇచ్చారా... అధిక పెన్షన్‌కు మీకు అర్హత ఉందా..?
అర్హత ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు.. అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వడంతోపాటు దరఖాస్తు నింపాలి. ఇందుకు ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లో లింకును అందుబాటులోకి తెచ్చింది.
రెండు రోజులే సమయం..!
2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారు అలాగే ప్రస్తుతం సర్వీసులో ఉండి అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు జాయింట్ ఆప్షన్ ఇవ్వాలి. వీరు మే 3 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు గడువు విధించింది. అయితే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలుండి ఆప్షన్ ఇచ్చి ఈపీఎఫ్‌ఓ ద్వారా తిరస్కరణకు గురైన వారు మాత్రం మార్చి 3లోపు జాయింట్ ఆప్షన్‌తోపాటు వివరాలు సమర్పించాలి. అర్హులు ఎవరైనా జాయింట్ ఆప్షన్‌ను ఇవ్వకుంటే భవిష్యత్తులో అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
చదవండి: వారానికి నాలుగు రోజులే పని... ఎప్పటి నుంచి అమలు అంటే...!
వీటిపై క్లారిటీ అవసరం...:
అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ విషయమై చాలామంది ఉద్యోగస్తులకు క్లారిటీ లేదు. అలాంటి వారి కోసం ఈ వివరాలు...
- ఉమ్మడి ఆప్షన్‌ను ఆన్‌లైన్లో నమోదు చేయాలి. ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చినా, యజమాని పంపించలేదని.. ఇతరత్రా కారణాలతో ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు తీసుకువచ్చారు.
- దరఖాస్తు చేసేందుకు గడువుతేదీని ఇప్పటికే ఆన్‌లైన్‌లోనే ఉంచింది. మళ్లీ దీనిపై ఈపీఎఫ్‌వో ప్రత్యేక ఆదేశాలు జారీ చేయదు.
- ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో పనిచేసినపుడు ప్రతినెలా పొందిన వేతనం ఆధారంగా పింఛను లెక్కించేందుకు పూర్తివివరాలు అవసరం. ఈ నేపథ్యంలో ఉద్యోగి గతంలో పనిచేసిన యజమాని నుంచి అక్కడ పనిచేసిన సర్వీసుకు సంబంధించి నెలవారీగా పొందిన వేతనం, ఈపీఎఫ్, ఈపీఎస్‌కు చెల్లించిన చందా వివరాలు, యజమాని నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉమ్మడి ఆప్షన్‌లో పూర్తి వివరాలు నమోదు చేస్తే అర్హులైన వారికి ఈపీఎఫ్‌వో అధిక పింఛను, ఈపీఎస్‌లో అదనంగా చెల్లించాల్సిన జమ వివరాలను లెక్కించేందుకు వీలవుతుంది.
చదవండి: కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే... సీపీఆర్ ఎలా చేయాలో తెలుకోండి
- వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు పింఛనునిధికి అదనంగా జమచేయాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రస్తుత యజమానికి పీఎఫ్ విభాగం సూచిస్తుంది. అదనపు డిపాజిట్ విషయమై ప్రస్తుత యజమాని, ఉద్యోగి సంయుక్తంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేయాలి.
- పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేటప్పుడు అధిక పింఛను ఆప్షన్, అదనపు డిపాజిట్ తదితర వివరాలు, ఆర్థికభారం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలన్నీ మదింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.
- ఆన్‌లైన్ డిక్లరేషన్ ఆధార్‌తో అనుసంధానమవుతుంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఖాతాలకు ఆన్‌లైన్ డిక్లరేషన్‌ను పోర్టల్ అనుమతించదు. అధిక పింఛనుతో కలిగే లాభాల గురించి యజమానులు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించాలి.