Skip to main content

Employees Working Days: వారానికి నాలుగు రోజులే ప‌ని... ఎప్ప‌టి నుంచి అమ‌లు అంటే...!

సండే.. హాలీడే... జాలీగా గ‌డిపేందుకు వార‌మంతా ఎదురుచూస్తుంటాం... వీక్లీ ఆఫ్ చాలా త్వ‌ర‌గా గ‌డిచిపోయిందే అని బాధ‌ప‌డ‌ని ఉద్యోగ‌స్తుడు ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదు.
work and life balanced

కానీ, వారానికి నాలుగు రోజులే ప‌ని అంటే.. విన‌డానికి ఎంత హాయిగా ఉందో క‌దా.. కానీ, యూర‌ప్ దేశాల్లో కొన్ని కంపెనీలు నాలుగు రోజులే ప‌నిదినాల్సి అమ‌లు చేస్తున్నాయి. 
హైబ్రీడ్‌ పద్ధతి అమల్లోకి...
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు కంపెనీలు, సంస్థల పని విధానమే మారిపోయింది. అప్పటివరకు ఆఫీసుకు వెళ్లి చేసే పని బదులు వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత కొన్నిరోజులు ఆఫీసు నుంచి, మరి కొన్నిరోజులు ఇంటి నుంచి పని (హైబ్రీడ్‌) చేసే పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్లు యూరప్‌లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవుల విధానం అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో 61 కంపెనీలు 3 వేల మంది ఉద్యోగులకు 6 నెలలపాటు ఫోర్‌డే వీక్‌ విధానాన్ని పరిశీలించాయి. 

చ‌ద‌వండి: గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌తో మార‌నున్న‌ రాష్ట్ర ముఖచిత్రం
ఇరుపక్షాలకూ లాభమే...
వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు ఉద్యోగుల పని–జీవితం బ్యాలెన్స్‌ కూడా మెరుగైనట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. అలాగే ఉద్యోగాలు మానేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు గతంలో మానేసిన వారు తిరిగి విధుల్లో చేరడం, అనారోగ్యంతో సెలవులు పెట్టే వారి సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. జీతం కంటే కూడా వారంలో ఒకరోజు పని తగ్గుదల వైపే మొగ్గుచూపుతున్నట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. 

employees


భారత్‌లో నిపుణుల స్పందనేంటి? 
మన దేశంలోనూ వారానికి 4 రోజుల పని విధానంపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీనిపై కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫ్‌ తీసుకోవచ్చని ఇందులో పొందుపరిచారు. అయితే ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ఆతిథ్య, తయారీ, రిటైల్‌ రంగాల్లో నాలుగు రోజుల పనివిధానం అమలు సాధ్యం కాదని, కేవలం ఈ–కామర్స్, బ్యాంకింగ్, బీమా, టెక్నాలజీ వంటి రంగాల్లోనే ఇది సాధ్యమనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే మ‌న‌దేశంలో నాలుగు రోజుల ప‌ని ఎప్ప‌టికి సాధ్య‌మ‌వుతుందో చెప్ప‌డం కష్ట‌మ‌ని నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు.

చ‌ద‌వండి:​​​​​​​ పుష్క‌లంగా వ‌న‌రులు...పెట్టుబ‌డుల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం
ఈ విధానం ఎలా అమల్లోకి...?
భారత్‌లో ఫోర్‌ డే వర్క్‌ విధానం అమలు వల్ల యాజమాన్యాలకు లేబర్‌ కాస్ట్‌లు, ఓవర్‌హెడ్‌ ఖర్చులు తగ్గడంతోపాటు ఉద్యోగులకూ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ మెరుగవుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. దాదాపు వందేళ్ల కిందటే వారానికి చేసే పనిదినాలను తగ్గించాలనే ఆలోచన వచ్చిందట. ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్‌ 1926లోనే 6 రోజులపని స్ధానంలో ‘ఫైవ్‌ డే వీక్‌’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది పనిగంటలు తగ్గించినంత మాత్రాన ఉత్పాదకతపై దాని ప్రభావం పడలేదని వెల్లడైంది. దీంతో ఇతర కంపెనీలు కూడా ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభించాయి.
మొద‌టిసారిగా అమెజాన్‌....
ఐర్లాండ్, ఐస్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్, కెనడా, వివిధ ఐరోపా దేశాలు ప్రయోగాలు చేశాయి. ‘ఫోర్‌ డే వర్క్‌’సిస్టమ్‌ను 2018లోనే టెక్‌ కంపెనీ అమెజాన్‌ ఎంపిక చేసిన ఉద్యోగులకు అమలు చేసింది. 2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్‌ నెలపాటు ఈ పద్ధతిని పరిశీలించింది. 2020లో యూనీలివర్‌ న్యూజిలాండ్‌లో ఏడాదిపాటు పరీక్షించింది. తద్వారా ఈ కంపెనీలు మంచి ఫలితాలనే సాధించాయి. ఆ తర్వాత విదేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 

చ‌ద‌వండి: స‌గం రోజులు సెల‌వులే... ఏ రోజుల్లో బ్యాంకులు ప‌నిచేస్తాయో తెలుసా..?​​​​​​​
ఇప్పటికే ఇక్కడ స్టార్టప్‌ ‘త్రీడే వీక్‌’! 
దాదాపు ఏడాదిన్నర క్రితమే బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం, ఇతర సౌకర్యాలు కల్పించింది. కొత్త ఆలోచనలు, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేందుకు తమ ›ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్‌ సభ్యులకు వారు కోరుకున్న పనివిధానంలో పనిచేసే అవకాశం కల్పించింది.

Published date : 01 Mar 2023 01:19PM

Photo Stories