Skip to main content

Bank Holidays: మార్చిలో స‌గం రోజులు సెల‌వులే... ఏయే రోజుల్లో బ్యాంకులు ప‌నిచేస్తాయో తెలుసా..?

మార్చిలో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు వ‌చ్చాయి. దాదాపు 12 రోజుల పాటు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు మూసేసి ఉంటాయి. ఆర్బీఐ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రెండు నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
Bank Holidays

వివిధ పండుగలు, రెండు, నాల్గవ శనివారాలు, నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు జాబితాలో ఉన్నాయి. క‌స్ట‌మ‌ర్లు జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకోకుంటే మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఏయే రోజుల్లో సెల‌వులు ఉన్నాయో తెలుసుకుని, ఈ మేర‌కు మీరు ప్లాన్ చేసుకోవ‌డం ఉత్తమం. సెల‌వు దినాల్లో కూడా ఆన్‌లైన్, మొబైల్,  నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

చ‌దవండి: 18 ఏళ్ల వ‌ర‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం రాదు... కానీ, ప్రొఫెస‌ర్ అయ్యాడిలా 

మార్చిలో బ్యాంకు సెలవుల జాబితా 
మార్చి 3 శుక్రవారం: చాప్‌చార్ కుట్ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు
మార్చి 5 - ఆదివారం
మార్చి 7 -హోలీ (2వ రోజు) 
మార్చి 8 - ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ 2వ రోజు
మార్చి 9 -హోలీ
మార్చి 11 - నెలలో రెండవ శనివారం
మార్చి 12 - ఆదివారం
మార్చి 19 - ఆదివారం
మార్చి 22 - ఉగాది 
మార్చి 25 - నాలుగో  శనివారం
మార్చి 26 - ఆదివారం
మార్చి 30 - శ్రీరామ నవమి

చ‌దవండి: ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల

Published date : 28 Feb 2023 01:38PM

Photo Stories