AP SI Preliminary Exams Results 2023 : ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ సారి కటాఫ్ మార్కులు ఇంతే..
411 ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన ప్రిలిమ్స్ రాత పరీక్ష పేపర్–1ను (అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించారు. ఈ పేపర్-1ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు. అలాగే పేపర్–2(జనరల్ స్టడీస్)ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. ఈ పేపర్-2ను 100 ప్రశ్నలు.. 100 మార్కులకు నిర్వహించారు.
☛ ఏపీ ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి
రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే..
ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అర్హత సాధించారు. ఇక, అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాల కోసం https://slprb.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోగలరు. అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 30 శాతం, బీసీలకు 35, ఓసీలకు 40 శాతంగా నిర్ణయించారు. అలాగే అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు రిక్రూట్‌మెంట్‌బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి విడుదల చేసింది.
☛ ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్-2023 పేపర్-1 కొశ్చన్ పేపర్ ఇదే
☛ ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్-2023 పేపర్-2 కొశ్చన్ పేపర్ ఇదే
ఏపీ ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 ఫైనల్ కీ ఇదే..