Skip to main content

AP SI Jobs 2022 Notification : 411 ఎస్‌ఐ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్షావిధానం.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.
AP SI Jobs
AP SI Jobs Notification 2022

411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి న‌వంబ‌ర్ 28వ తేదీన ప్ర‌భుత్వం నోటిఫికేషన్ విడుద‌ల చేశారు. ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించి.. నోఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.

పోస్టుల వివ‌రాలు ఇవే..
మొత్తం 411 ఎస్‌ఐ పోస్టుల్లో.. 315 ఎస్‌ఐ(సివిల్‌), 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

☛ సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) : 315

☛ ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులు : 96

మొత్తం ఎస్సై పోస్టుల సంఖ్య : 411

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎస్సై పోస్టులకు..
ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన‌ ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్స్ ఫిబ్రవరి 02, 2023 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు.

ప‌రీక్ష విధానం :
ఎస్సై ప‌రీక్షలో ప్రధానంగా నాలుగు దశల్లో ఎంపిక‌ ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎస్సై మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షావిధానం ఇలా..
ఎస్సై ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో మొదటి పేపర్ లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అలాగే సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.

శారీరక సామర్థ్య పరీక్షలు..

ap si jobs events 2022

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు దేహదారుడ్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. 1600 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఇవి కేవలం అర్హత కోసం మాత్రమే. వీటిలో ఎలాంటి మెరిట్ ఉండదు. ఇక ఏపీఎస్పీ ఎస్సైలో మాత్రం  1600 మీ, 100 మీ, లాంగ్ జంప్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. వీటిలో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

ఎస్సై మెయిన్స్ ప‌రిక్షావిధానం ఇదే..

ఎస్సై మెయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 & 2 అర్హత పరీక్షలు కాగా.. పేపర్ 3 లో 100 మార్కులు, పేపర్ 4 లో 100 మార్కులు కేటాయించారు. అంతే కాకుండా.. పీఈటీలో 100 మార్కులు ఉంటాయి. వీటిలో సాధించిన మెరిట్ అధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

Competitive Exams: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?

ఎస్సై దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు 600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఏర్పడినా.. సందేహాలు ఉన్నా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు 9441450639 నంబర్ ను సంప్రదించవచ్చు.

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips

ముఖ్యమైన తేదీలు ఇవే..

➤ ఎస్సై పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 14, 2022

➤ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ : జనవరి 18, 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు..

➤ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2023

411 ఎస్‌ఐ ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 28 Nov 2022 11:02PM
PDF

Photo Stories