Skip to main content

Good News For AP DSC 2024 Candidates : ఏపీ డీఎస్సీ-2024 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ‌ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన‌ డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన (సోమవారం) విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
DSC-2024 Notification Released Date   Teacher Job Opportunities in Andhra Pradesh   Andhra Pradesh DSC-2024 Recruitment Alert   AP DSC 2024 Applications   Andhra Pradesh Government Teacher Recruitment Announcement

ఈ పోస్టుల‌కు ఫిబ్ర‌వ‌రి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు విధించారు.  ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే ఏపీ డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు విన్నపం మేర‌కు ఈ ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రో మూడు రోజుల పాటు పొడిగించారు. మార్చి 15వ తేదీ నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌ను రోజు రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 12 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల రెండో విడత ఉంటుంది. మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తేలిసిందే. 

ఇప్పటివరకు టెట్‌కు 3,17,950 మంది, డీఎస్సీకి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హెల్ప్‌ డెస్క్‌ సమయాలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది.

దరఖాస్తుల్లో ఎడిట్‌ ఆప్షన్‌కు..
అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్‌ను ఎడిట్‌ చేసుకొని మళ్లీ సమర్పించుకొనే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎడిట్‌ ఆప్షన్‌కు పాటించాల్సిన సూచనలివే.. 

☛ తొలుత అభ్యర్థులు వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/లో డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అభ్యర్థి పాత జర్నల్‌ నంబర్‌తో, అభ్యర్థి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి డిలీట్‌ ఆప్షన్‌ను పొందవచ్చు. తద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్ది  అప్లపికేషన్‌ను మళ్లీ సమర్పించుకోవచ్చు.

వీరికి మాత్రమే ఛాన్స్‌..
అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్‌ మార్చుకోవాలంటే  పరీక్ష కేంద్రంలో నామినల్స్‌ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు.
 

ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..?
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 1న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2న ఫైనల్‌ కీ విడుదల, ఏప్రిల్‌ 7న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు మరో 5 ఏళ్లు అంటే 54 ఏళ్ల వయోపరిమితి పెంచారు. ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, కన్వీనర్‌గా డీఈఓ వ్యవహరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.

Published date : 21 Feb 2024 04:20PM

Photo Stories