AP SI of Police Mains Exams: కర్నూలులో మెయిన్ పరీక్షకు 426 మంది ఎంపిక
కర్నూలు: రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో 13వ రోజు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో మంగళవారం జరిగిన ఈ పరీక్షలకు 800 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 617 మంది హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు.
GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
అనంతరం వారందరికీ శారీరక సామర్థ్య పరీక్షలు (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు) 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో 426 మంది ప్రతిభ కనబరిచి ఎస్‌ఐ తుది రాత పరీక్ష(మెయిన్స్)కు అర్హత సాధించారు.