SI Written Exam date: SI రాతపరీక్ష తేదీలు ఇవే...
ఏలూరు టౌన్: ఎస్సై మెయిన్స్ రాతపరీక్షలకు సర్వం సన్నద్ధం చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ డీ.మేరిప్రశాంతి, అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కర్ ఉన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెయిన్స్ పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ చెప్పారు.
గరంలో ఎస్సై మెయిన్స్ పరీక్షకు 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో నాలుగు పేపర్లు ఉంటాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఏలూరు శివారు వట్లూరులోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, సీఆర్‌ఆర్ మహిళా కళాశాల, కొత్తబస్టాండ్ సమీపంలోని సీఆర్‌ఆర్ అటానమస్ కళాశాల, ఆర్‌ఆర్‌పేటలోని సెయింట్ థెరిస్సా కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు ఏలూరు రేంజ్ పరిధిలో 4,162 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని డీఐజీ తెలిపారు.