Skip to main content

SI Mains Written Exam: SI మెయిన్స్‌ రాత పరీక్ష ఎప్పుడంటే...

SI Mains Written Exam, Kurnool SI Job Recruitment,SI Job Written Test on 14th and 15th in Kurnool
SI Mains Written Exam

కర్నూలు: రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈనెల 14, 15 తేదీలలో కర్నూలులో 12 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. 7,644 మంది పురుషులు, 877 మంది మహిళా అభ్యర్థులు కలిపి మొత్తం 8,521 మంది హాజరుకానున్నారు.

ఈనెల 6 నుంచి 12వ తేదీ లోపు slprb.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ అతుల్‌సింగ్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. సమస్యలు తలెత్తితే 9441450639, 9100203323 సంప్రదించాలన్నారు.

Published date : 07 Oct 2023 07:44AM

Photo Stories