Skip to main content

APGIS 2023: పుష్క‌లంగా వ‌న‌రులు...పెట్టుబ‌డుల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం

సుధీర్ఘ తీర‌ప్రాంతం, అపార‌మైన స‌హ‌జ వ‌న‌రులు.. అన్నింటికి మించి ఉత్త‌మ‌మైన పాల‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు రాచ‌బాట ప‌రుస్తోంది. ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ స‌మ్మిట్‌కు పారిశ్రామిక దిగ్గ‌జాలు క్యూ క‌ట్ట‌నున్నారు.
CM YS Jaganmohan Reddy

రెండు రోజుల పాటు నిర్వ‌హించే సమ్మిట్ మొద‌టి రోజైన మార్చి 3వ తేదీ మ‌ధ్యాహ్నం వివిధ రంగాల వారీగా సెమినార్లు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పారిశ్రామిక వేత్త‌లు పాల్గొని త‌మ ల‌క్ష్యాల‌ను వివ‌రించ‌నున్నారు.
మార్చి 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.50 వరకు
అంశం: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
మోడరేటర్‌: సౌరభ్‌గౌర్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి
వక్తలు: డాక్టర్‌ సత్యనారాయణ డైరెక్టర్‌ ఐఐటీ తిరుపతి, రవి తంగిరాల మాస్‌ మ్యూచువల్‌ హెడ్, ఫ్రొఫెసర్‌ కోన్‌ ముజాకిస్‌ డైకిన్‌ యూనివర్సిటీ కోఫౌండర్, శ్రీధర్‌ కోసరాజు ఐటాప్‌ ప్రెసిడెంట్, లక్స్‌రావు చేపూరి సీఈవో టెక్నోజెన్, విజయ్‌ భాస్కర్‌ రెడ్డి టెక్‌బుల్‌ డైరెక్టర్‌

ఆటోమొబైల్‌– ఎలక్ట్రిక్‌ వాహనాలు
మోడరేటర్‌: పీస్‌ ప్రద్యుమ్న, రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి
వక్తలు: మాట్రిన్‌ ఎంబర్‌హార్డ్‌ టెస్లా కోఫౌండర్, కేవీ ప్రదీప్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ, రాజేష్‌ మిట్టల్‌ ఇసుజు ఇండియా ప్రెసిడెంట్, కబ్‌దాంగ్‌లీ కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్, శశాంక్‌ శ్రీవాత్సవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, కమల్‌ బాలి వోల్వో గ్రూపు ప్రెసిడెంట్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌.

చ‌ద‌వండి: 3వ తేదీ నుంచి గ్లోబ‌ల్ స‌మ్మిట్‌... విశాఖ‌కు పారిశ్రామిక దిగ్గ‌జాల క్యూ..

రెన్యువబుల్‌ ఎనర్జీ
మోడరేటర్‌: రమణారెడ్డి, నెడ్‌క్యాప్‌ ఎండీ
వక్తలు: గురుదీప్‌సింగ్‌ ఎన్‌టీపీసీ సీఎండీ, అనిల్‌ చలమలశెట్టి గ్రీన్‌కో సీఈవో, నవాల్‌ సైని బ్రూక్‌ఫీల్డ్‌ ఎండీ, సుబ్రమణ్యం పులిపాక నేషనల్‌ సోలార్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో, డేవిడ్‌ ఏ కొల్లార్డ్‌ స్కేల్‌ ఫెసిలిటేషన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌–సీఈవో, విపుల్‌ తులి సెంబ్‌కార్ప్‌ సౌత్‌ ఏషియా సీఈవో, విశ్వేశర రెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ ఎండీ.

సాయంత్రం 4 నుంచి 4.50 వరకు
ఇండస్ట్రియల్‌ లాజిస్టిక్‌ – ఇన్‌ఫ్రా
మోడరేటర్‌: రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో ఏపీ మారిటైమ్‌ బోర్డు
వక్తలు: సుమిత్‌ దావ్రా డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి(లాజిస్టిక్స్‌), జీబీఎస్‌ రాజు చైర్మన్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, రవి సన్నారెడ్డి చైర్మన్‌ శ్రీసిటీ, రవికాంత్‌ యమర్తి లాజిస్టిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్, సుకుమార్‌ కామేశ్వరన్‌ సీవోవో టీవీఎస్‌ సప్లైచైన్‌ సొల్యూషన్స్, అనయ్‌ శుక్లా సీసీవో వెల్సపన్‌ వన్‌ లాజిస్టిక్స్‌.

Gudivada Amarnath

స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌
మోడరేటర్‌: సౌరభ్‌ గౌర్, కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ
వక్తలు: బీవీ నాయుడు, కర్నాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ చైర్మన్, విజయ్‌ శేఖర్‌ శర్మ, పేటీఎం ఫౌండర్‌ చైర్మన్, శ్వేత రాజ్‌పాల్‌ కొహ్లి సీక్వోయా క్యాపిటల్‌ చీఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఆఫీసర్, పడాల భూదేవి సవర వుమెన్‌ సామాజిక కార్యకర్త, రాజా శ్రీనివాస్‌ ఆర్‌ఎన్‌ఐటీ సొల్యూషన్స్‌ ఫౌండర్‌ సీఈవో, అంకిత్‌ అగర్వాల్‌ ఫూల్‌ కంపెనీ ఫౌండర్‌ సీఈవో, హర్షిల్‌ మాథూర్‌ రజోర్‌పే సీఈవో–కోఫౌండర్‌.

హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌
మోడరేటర్‌ : టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి, వైద్యశాఖ
వక్తలు: దిలీప్‌ జోష్‌ మణిపాల్‌ హాస్పిటల్‌ గ్రూపుసీఈవో, డాక్టర్‌ గురునాథ్‌ రెడ్డి కాంటినెంటల్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ, డాక్టర్‌ ముఖేష్‌ తిప్రాఠి ఎయిమ్స్‌ మంగళగిరి డైరెక్టర్, విభవ్‌ గార్గ్‌ బోస్టన్‌ సైంటిఫిక్‌ డైరెక్టర్, ఆనంద్‌ కే  ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నస్టిక్స్‌ సీఈవో, డాక్టర్‌ జితేంద్ర శర్మ ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ సీఈవో

సాయంత్రం 5 నుంచి 5.50 వరకు
ఎలక్ట్రానిక్స్‌
మోడరేటర్‌ : సౌరభ్‌ గౌర్, కార్యదర్శి ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్‌ శాఖ
వక్తలు: జోష్‌ ఫల్గర్‌ భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌ కంట్రీ హెడ్‌– ఎండీ, శశికుమార్‌ జి సాల్‌కామ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండియా ఎండీ, దాసరి రామకృష్ణ ఎఫ్‌ట్రానిక్స్‌ ఎండీ, ప్రోఫెసర్‌ జాక్‌ సింగ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ సారస్వక్, దేవిదాస్‌ కస్‌బేకర్‌ బ్లూస్టార్‌ క్లైమెటిక్‌ సీఈవో.

అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌
మోడరేటర్‌: చిరంజీవి చౌదరి కార్యదర్శి ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌
వక్తలు:  మనోజ్‌ అహుజా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సతోషి ససకి ఐఎల్‌వో సౌత్‌ ఏషియా డిప్యూటీ డైరక్టర్, జే రాజన్‌ అముల్‌ సౌత్‌ ఇండియా జోనల్‌హెడ్, పి.వెంకటరావు బ్లూస్టార్‌ ప్రెసిడెంట్‌ సీవోవో, హెన్రిక్‌ స్టమ్‌ క్రిస్టెన్సన్‌ బ్లెండ్‌ హబ్‌ కార్ప్‌ ఫౌండర్, బలరామ్‌ సింగ్‌ యాదవ్‌ గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఎండీ.

Published date : 28 Feb 2023 07:04PM

Photo Stories