Skip to main content

G20 Summit 2023: విశాఖపట్నంలో జీ–20 సదస్సు..

విశాఖపట్నంలో మార్చి 28 నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరుగున్నాయి.
 G-20 Summit

ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో మార్చి 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరుగుతుంది. నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. జి–20 సమావేశాలు పురస్కరించుకుని రూ.157 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. కాగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది.  

తొలిరోజు నాలుగు సెషన్లు
జీ20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు మార్చి 28న‌ విశాఖ సాగర తీరంలో ఘనంగా ప్రారంభమైంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో తొలిరోజు నాలుగు సెషన్లు నిర్వహించగా 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులను పెంచడం తదితర అంశాలపై చర్చించారు. 

Amplus Solar: ఆంధ్రప్రదేశ్‌లో.. రూ. 1,750 కోట్ల పెట్టుబడులు

ప్రతి ఒక్కరికీ సొంతింటిని సమకూర్చడమే లక్ష్యం.. 

G20 summit


విశాఖలో ప్రారంభమైన జీ 20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశంలో మార్చి 28న రాత్రి వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. సుస్థిరాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామ‌న్నారు. గృహ నిర్మాణ రంగంలో కీలకమైన మౌలిక వసతులను కల్పించడంలో స్థిరమైన విధానాలపై జీ 20 వర్కింగ్‌ గ్రూపు ఆలోచన చేయాలని కోరారు. ‘రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైనేజీ, రోడ్లు, కరెంటుం.. ఇలా కనీస సదుపాయాలను కల్పించడంలో స్థిరమైన విధానాలపై జీ20 వర్కింగ్‌ గ్రూపు ఆలోచన చేయాలని కోరుతున్నా. ఖర్చును తగ్గించడంతోపాటు నిర్మాణంలో నాణ్యత అత్యంత ప్రధానం. కలల లోగిళ్లు చిరకాలం నిలిచేలా ఎలాంటి విధానాలను అనుసరించాలన్న అంశంపై చర్చించాలి. ఈ చర్చల్లో అందుకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని ఆశిస్తున్నా’అని తెలిపారు.  

జి–20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం జగన్‌ ఆత్మీయ విందు ఇచ్చారు. రాష్ట్ర సాంస్కృతిశాఖ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన  కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఆంధ్రప్రదేశ్‌ సాంప్రదాయ, సాంస్కృతిక పరిణామంతోపాటు, రాష్ట్ర చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజెప్పేలా చేసిన‌ నృత్య ప్రదర్శన అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
 

Published date : 29 Mar 2023 03:25PM

Photo Stories