Skip to main content

APGIS 2023: 3వ తేదీ నుంచి గ్లోబ‌ల్ స‌మ్మిట్‌... విశాఖ‌కు పారిశ్రామిక దిగ్గ‌జాల క్యూ..

సహజ వనరులకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలను సద్విని­యోగం చేసుకుంటూ కీలకమైన 15 రంగాల్లో పెట్టు­బ­డులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 3, 4వ తేదీల్లో స‌మ్మిట్ జ‌ర‌గ‌నుంది.
Global Investors Summit 2023

తొలిరోజైన మార్చి 3వ తేదీ తొమ్మిది రంగాలపై, రెండో రోజు 6 రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఫుడ్‌ ప్రాసె­సింగ్, రెన్యువబుల్‌ ఎనర్జీ–గ్రీన్‌ హైడ్రోజన్, హెల్త్‌­కేర్‌–­మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఏరోస్పేస్‌–డిఫెన్స్, పెట్రోలియం–ప్రెటో కెమికల్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రా–లాజిస్టిక్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌–ఈవీ, స్టార్టప్స్‌–­ఇన్నోవే­షన్స్, ఉన్నత విద్య, టూరిజం, టెక్స్‌టైల్, ఫార్మా స్యూటికల్స్‌ రంగాలను ప్ర‌భుత్వం ఎంపిక చేసింది.
రెండు రోజుల్లో 15 సెమినార్లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఒనగూరే లాభాలను వివరిస్తూ ఇప్పటికే పెట్టుబ­డులు పెట్టిన సంస్థల అభిప్రాయాలతో వీడియో విజువల్స్‌ సిద్ధం చేయడమే కాకుండా ప్రత్యేక సెషన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జా­తీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని  అందిపుచ్చుకోవడం లాంటి అంశాలపై పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొనేలా మొత్తం 15 సెమినార్లను నిర్వహించనుంది.  

Global Investors Summit


సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న కార్య‌క్ర‌మం...
జీఐఎస్‌ 2023లో పాల్గొనేందుకు దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు విశాఖకు తరలి వస్తున్నాయి. రిలయన్స్‌ గ్రూపునకు చెందిన ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూపు గౌతమ్‌ అదాని, అర్సల్‌ మిట్టల్‌ గ్రూపు సీఈవో ఆదిత్య మిట్టల్, ఆదిత్య బిర్లా గూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా, టెస్లా కోఫౌండర్‌ మార్టిన్‌ ఎంబరహర్డ్‌ లాంటి 22 మందికిపైగా కార్పొరేట్‌ ప్రముఖులు ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. మార్చి 3వతేదీన తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 వరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
పాల్గొన‌నున్న కేంద్ర మంత్రులు
కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ఆర్కే సింగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కేంద్ర కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సెమినార్లు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సెమినార్లు జరుగుతున్న సమయంలోనే ప్రధాన సమావేశ మందిరంలో ఆహార వ్యవస్థలో మారుతున్న పరిణామ క్రమాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
సీఎం సమక్షంలో ఒప్పందాలు...
సమ్మిట్‌ రెండో రోజు మార్చి 4న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 వరకు సెమినార్లు జరుగుతాయి. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాలు జ‌రిగ‌న త‌ర్వాత ముగింపు సమావేశం జరగనుంది. ముగింపు కార్య‌క్ర‌మంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, వెల్‌ప్సన్‌ గ్రూపు ఎండీ రాజేష్‌ మండవేవాలా, దివీస్‌ ల్యాబ్‌ సీవోవో కిరణ్‌ దివీ, లారస్‌ ల్యాబ్‌ ఫౌండర్‌ సీఈవో చావా సత్యనారాయణతోపాటు మొత్తం 10 మంది కార్పొరేట్‌ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనావాలా, రాజీవ్‌ చంద్రశేఖరన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ముగింపు సమావేశానికి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 

Published date : 28 Feb 2023 06:37PM

Photo Stories