APGIS 2023: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, జీఎంసీ గ్రూపుల అధినేతలు సదస్సుకు హాజరుకానున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మార్చి 4వ తేదీ జరగనున్న సదస్సులో ఉదయం నుంచి వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు.
మార్చి 4వతేదీ..
ఉదయం 10.30 నుంచి 11.20 వరకు
పెట్రో అండ్ పెట్రో కెమికల్స్
మోడరేటర్ : ప్రకాష్ గౌర్ సీఈవో ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్
వక్తలు: అరుణ్ బరోకా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, జనార్థన్ రామానుజులు ఎస్‌ఏబీఐసీ వైస్ ప్రెసిడెంట్, ఏవీ సహనే ఐవోసీఎల్ ఈడీ, డీవీఎస్ నారాయణ రాజు డెక్కన్ ఫైన్ కెమికల్స్
ఉన్నత విద్య
మోడరేటర్: హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ.
వక్తలు : ఫ్రొఫెసర్ యూబీ దేశాయ్ ఐఐటీ హైదరాబాద్ ఫౌండింగ్ డైరెక్టర్, డాక్టర్ జీ విశ్వనాథన్ విట్ యూనివర్సిటీ చాన్సలర్, పద్మశ్రీ ఎన్ బాలకృష్ణన్ ఐఐఎస్‌సీ బెంగళూరు ఎయిరోడైనమిక్స్ ప్రొఫెసర్, డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ సీవోవో ఏఐసీటీఈ, ఎం చంద్ర శేఖర్ ఐఐఎం విశాఖ డైరెక్టర్, ప్రొఫెసర్ జంధ్యాల బిజీ తిలక్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్
చదవండి: పుష్కలంగా వనరులు...పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
టెక్స్‌టైల్ అండ్ అప్పరెల్
మోడరేటర్ : ఆర్‌సీఎం రెడ్డి ఎండీ సీఈవో స్కూల్‌నెట్ ఇండియా
వక్తలు: యూపి సింగ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాజేష్ మండవేవాలా వెల్సపన్ గ్రూపు ఎండీ, నారెన్ గోయంకా టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, సుచిరా సురేంద్రనాథ్ బ్రాండిక్స్ డైరెక్టర్, ప్రశాంత్ అగర్వాల్ వైజర్ అడ్వైజర్స్ కో–ఫౌండర్, సచిన్ మాలిక్ ఏషియా ఫసిఫిక్ రేయాన్ గ్లోబల్ సేల్స్ హెడ్.
ఉదయం 11.30 నుంచి 12.20 వరకు
స్కిల్ డెవలప్‌మెంట్
మోడరేటర్: సౌరభ్‌గౌర్, కార్యదర్శి ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్
వక్తలు : రాజీవ్ చంద్రశేఖరన్ కేంద్ర సహాయమంత్రి, అతుల్ తివారీ కేంద్రకార్యదర్శి ఎంఎస్‌డీఈ, అనితా రాజన్ టాటా స్ట్రైవ్ సీఈవో, సంజయ్ విశ్వనాథన్ ఈడీ4ఆల్ కోఫౌండర్, సునిల్ దహియా వాద్వాని ఫౌండేషన్ ఈవీపీ, సంజయ్ అవస్థి యునెస్కో హెడ్, కీర్తి సేత్ నాస్కాం ఫ్యూచర్ స్కిల్ సీఈవో
చదవండి: 3వ తేదీ నుంచి గ్లోబల్ సమ్మిట్... విశాఖకు పారిశ్రామిక దిగ్గజాల క్యూ..
పర్యాటకం
మోడరేటర్: రజిత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ
వక్తలు : సుభాష్ గోయల్ ఎస్‌టీఐసీ ట్రావెల్స్ చైర్మన్, సంజయ్ సేథి చాలెట్ గ్రూపు సీఈవో ఎండీ, అనిల్ చద్ధా ఐటీసీ హోటల్స్ సీఈవో, దినేష్ చద్దా తాజ్‌గ్రూపు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, సంజయ్ రాజ్ ఎండీ,సరోవర్ గ్రూపు, పూజా రే మైఫేర్ ఎండీ, ఆర్ శ్రీనివాస్ ఎక్స్ డెలాయిట్ గ్లోబల్ హెడ్(టూరిజం)
ఫార్మా లైఫ్ సైన్సెస్
మోడరేటర్: జే.నివాస్, కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ
వక్తలు: సతీష్‌రెడ్డి డాక్టర్ రెడ్డీస్ చైర్మన్, సత్యనారాయణ చావా లారస్ ల్యాబ్ ఫౌండర్ సీఈవో, ఎంఎన్‌రావు మైలాన్ ల్యాబ్ కంట్రీ హెడ్, విక్రం శుక్లా ఫైజర్ వైస్ ప్రెసిడెంట్, అజుమా ఫుజిమురా ఈసాయి ఫార్మాస్యూటికల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్