Skip to main content

Free Courses for Woman: మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సులు

ఉచితంగా ఈ కోర్సుల్లో శిక్ష‌ణ పొందేందుకు మ‌హిళ‌లు త‌మ వివ‌రాలను ప్ర‌క‌టించిన వెబ్‌సైట్ లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని తెలిపారు. ఈ ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, తేదీలను కింది వివ‌రాల‌లో ప్ర‌క‌టించారు.
Free ANM courses for woman
Free ANM courses for woman

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన(ఏ గ్రూపు అయినా) మహిళలకు రెండు సంవత్సరాల ఉచిత మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌/ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదర్శ మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ ట్రైనింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఈదూరు పద్మాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

SA 1 Exams: ఎస్‌ఏ–1 పరీక్షలు తేదీలు ఇవే..

మొత్తం సీట్లు 40 ఉన్నాయని, ప్రవేశం పొందాలనుకునే మహిళలు 2023 డిసెంబర్‌ 31వ తేది నాటికి 17 సంవత్సరాల వయస్సు నిండి 30 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. దరఖాస్తులను ప్రభుత్వ వెబ్‌సైట్‌ http://cfw.ap.nic.in నుంచి పొందాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 31లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. వివరాలకు 9848352725, 7416404740 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Published date : 05 Oct 2023 04:07PM

Photo Stories