SA 1 Exams: ఎస్‌ఏ–1 పరీక్షలు తేదీలు ఇవే..
అక్టోబర్ 30లోపు జవాబు పత్రాలను దిద్ది, 31వ తేదీన ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీన తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ కార్డులు వారికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా పరీక్షల సమయాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6, 8, 10 తరగతులవారికి ఉదయం, 7, 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
1–5 తరగతులకు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 6 ,8, తరగతులకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు, ఏడో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.45గంటల వరకు, 9వ తరగతికి విద్యార్థులకు మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు, పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను ఆయా పాఠశాలలకు చేరవేశామని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పద్మ తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో రవీందర్‌రెడ్డి ఆదేశించారు.