Skip to main content

Schools Closed: ఈ రాష్ట్రంలో రేప‌టి నుంచి పాఠశాలలు మూత‌..కార‌ణం ఇదే

సాక్షి,ఎడ్యుకేష‌న్‌: డిసెంబ‌ర్ 3వ తేదీన‌ నుంచి ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి.
Delhi schools closed
Delhi schools closed

వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. కాగా, ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక పరీక్షలు సైతం యథావిథిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో పాఠశాలలను ఏ విధంగా తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి, ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది.

ఇటీవ‌లే..
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్‌ ప్రభుత్వం న‌వంబ‌ర్ 13వ తేదీన‌ కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే.న‌వంబ‌ర్ 15వ తేదీ నుంచి దేశ రాజధానిలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

అలాగే ఉద్యోగుల‌కు వర్క్‌ ఫ్రం హోం...
కాగా ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు వర్క్‌ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విలైనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.

Holidays: వచ్చే ఏడాదికి సెలవులు ఇవే..వీరికి నిరాశే...

ఈ పాఠ‌శాల‌లో 42 మంది విద్యార్థుల‌కు క‌రోనా..

Holidays 2022: తెలంగాణ‌లో వచ్చే ఏడాది సెలవులివే..అత్య‌ధిక సెల‌వులు ఈ నెల‌లోనే

AP CM YS Jagan: 1వ‌ తరగతిలోనే బీజం వేస్తే...20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధంగా..

Job Opportunities: ఇక మీదే ఆలస్యం..కోటికి పైగా ఉద్యోగాలు..!

Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ కలకలం..ఎంటరైనా వైరన్‌..

Any Competitive Exam: పరీక్షలెన్నో.. ప్రిపరేషన్‌ ఒక్కటే!

Published date : 02 Dec 2021 07:17PM

Photo Stories