Skip to main content

Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ కలకలం..ఎంటరైనా వైరస్‌..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించింది. తాజాగా.. భారత్‌లో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
Omicron Virus
Omicron Virus

కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.  ఇప్పటికే ప్రపంచ దేశాలలో ఒమిక్రాన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకూ 29 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూడగా, 373 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ దాదాపు సద్దుమణిగిందనుకున్న తరుణంలో ఒమిక్రాన్‌గా రూపుమార్చుకుని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించకుండా కేంద్రం ముందుగానే చర్యలు చేపట్టినప్పటికీ రెండు కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది.

Omicron: ఒమిక్రాన్‌’ అనే వేరియెంట్ అంటే ఏమిటి? దీని కథాకమామిషూ..

కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాధి- లక్షణాలు,ప్రభావం, చికిత్స

Covid-19: ఒమిక్రాన్‌ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ?

WHO: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

Published date : 13 Jan 2022 05:15PM

Photo Stories