Covid-19: ఒమిక్రాన్ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ?
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘‘ఒమిక్రాన్’’ మొదటి ఫోటోను ఇటలీ రాజధాని రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ విడుదల చేసింది. నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ఒక మ్యాప్‌లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఒమిక్రాన్‌తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్(బి.1.1.529) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంతవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి.
చదవండి: కోవిడ్ నూతన వేరియంట్ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి ఫోటోను విడుదల చేసిన సంస్థ?
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్
ఎక్కడ : రోమ్, ఇటలీ
ఎందుకు : కోవిడ్–19 పరిశోధనల్లో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్