US visa: అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త... వీసా స్లాట్లు విడుదల చేసిన యూఎస్ ఎంబసీ
జులై నుంచి ఆగస్టు మధ్య కాలానికి ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ustraveldocs.com సందర్శించి అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవచ్చని యూఎస్ ఎంబసీ సూచించింది.
American Visa: భారతీయులకు గుడ్ న్యూస్... ఇకపై ఇండియన్లకు మరిన్ని వీసాలు
అమెరికాలో ఉన్నత విద్యకోసం భారతీయులే అధిక సంఖ్యలో వెళ్తున్నారు. గతేడాది 1.25 లక్షల మంది విద్యార్థులకు వీసాలు జారీ చేసింది యూఎస్ ప్రభుత్వం. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. అమెరికాకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయ విద్యార్థి ఉంటున్నారంటే మన వాళ్లు ఏ స్థాయిలో యూఎస్‌కు వెళుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
Good news to IT Employees: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా... అయితే ఈ న్యూస్ మీ కోసమే..!
గతేడాదితో పోలిసే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది విద్యార్థులు యూఎస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన వీసా డే వార్షికోత్సవం సందర్భంగా ఒకే రోజు దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ల ద్వారా 3500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది యూఎస్ ఎంబసీ.
JoSAA counselling 2023: ప్రారంభమైన జోసా కౌన్సెలింగ్... ఆప్షన్లు ఇలా ఇచ్చుకోండి
అమెరికాలోని విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన దేశ విద్యార్థులు అధికంగా వెళుతుంటారు. ఇప్పటికే అనేక మంది భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల నుంచి ఐ-20 ధ్రువపత్రాలను పొందారు. వీరికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.