American Visa: భారతీయులకు గుడ్ న్యూస్... ఇకపై ఇండియన్లకు మరిన్ని వీసాలు
ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ప్రకటించారు.
Visa: స్టూడెంట్స్‌కు షాక్... వీసా ఫీజును పెంచేసిన అమెరికా
ప్రధాని అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే పర్యటనలో దౌత్యం, ఇమ్మిగ్రేషన్ వీసా సమస్యలకు సంబంధించి అమెరికా నుంచి ఇండియా ఏమి ఆశించవచ్చనే ప్రశ్నకు సమాధామిచ్చిన మాథ్యూ మిల్లర్ వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా వ్యాఖ్యానించారు.
H-1B Visa: ఉద్యోగ కోతల వేళ భారతీయ టెకీలకు శుభవార్త..హెచ్-1బీ వీసా ఉన్న వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయెచ్చు..
భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని, ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వీసాలకు సంబంధించి, తమ కాన్సులర్ బృందాలు అనేక వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాయన్నారు. జూన్ 21-24 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.