Visa: స్టూడెంట్స్‌కు షాక్... వీసా ఫీజును పెంచేసిన అమెరికా
Sakshi Education
అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది.
అలాగే తాత్కాలిక వృత్తిదారుల(టెంపరరీ వర్కర్స్)కు ఇచ్చే కొన్ని రకాల నాన్ ఇమ్మిగ్రంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తి నిపుణులకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు
చదవండి: మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే... అప్రమత్తమైన రాష్ట్రాలు
Published date : 09 Apr 2023 07:59PM