రూ.4,000 నిరుద్యోగ భృతి.. ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు
Sakshi Education
పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పలు తాయిలాలు ప్రకటించింది.
తమను గెలిపిస్తే ప్రభుత్వోద్యోగాల్లో 75 శాతం, ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 శాతం రాష్ట్ర యువతకే దక్కేలా రిజర్వేషన్లు కేటాయిస్తామని ఫిబ్రవరి 12న విడుదల చేసిన మూడో మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 35 శాతం కేటాయిస్తామని చెప్పింది. డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల దాకా నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది.
చదవండి:
స్కూల్స్ ఆఫ్ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు
Colleges: వనపర్తి, నిజామాబాద్‌లలో కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
Published date : 14 Feb 2022 05:56PM