Skip to main content

Colleges: వనపర్తి, నిజామాబాద్‌లలో కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో కొత్త ఉన్నతవిద్య కాలేజీల ఏర్పాటుపై సర్కారు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.
Colleges
వనపర్తి, నిజామాబాద్‌లలో కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు

ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో తేవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చెబుతోంది. వచ్చే ఏడాది వనపర్తిలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా సర్కార్‌ జీవో కూడా ఇచ్చింది. ప్రస్తుతం అక్కడున్న పాలిటెక్నిక్‌ కాలేజీలోనే దీన్ని నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే నిజామబాద్‌ జిల్లా నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా అక్కడ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటును పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్ టీయూహెచ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు గద్వాల్‌లోనూ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదా రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం కోఠిలో ఉన్న ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం భావించింది. అదేవిధంగా కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని విశ్వవిద్యాలయం స్థాయికి పెంచే ప్రతిపాదనలు సిద్ధమవగా వాటితోపాటే పాలకుర్తి, ఘన్ పూర్‌ ప్రాంతాల్లోనూ కొత్త ప్రభుత్వ కాలేజీలు తేవాలని సర్కారు భావిస్తోంది. మొత్తంమీద సాంకేతిక విద్యను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ప్రొఫెసర్ల కొరత మాటేంటి?

కొత్త కాలేజీల మాటెలా ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వ కాలేజీల్లోనే ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమ్మతించినా అనేక కారణాల వల్ల ఇది ఆచారణకు నోచుకోలేదు. ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలనే దానిపై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్ ద్వారానా లేక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా భర్తీ చేయడమా అనే దానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు.

చదవండి: 

Jobs: ఐటీ కారిడార్‌తో లక్ష ఉద్యోగాలు

Jobs: యువతకు ఉద్యోగాల్లేవు.. కోట్లాది మందివి చిన్నాచితకా ఉద్యోగాలే.. 

స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు

Published date : 14 Feb 2022 03:27PM

Photo Stories