Skip to main content

UGC NET Result 2023: నేడే నెట్ ఫ‌లితాలు..! ఇలా చెక్ చేసుకోండి

దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ టెస్ట్(నెట్‌) ఫ‌లితాలు నేడు(ఏప్రిల్ 10) విడుద‌లయ్యే అవ‌కాశముంది. ఇందులో అర్హత సాధిస్తే పీహెచ్‌డీలో చేరే అవకాశంతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. దీంతోపాటు బోధన రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్ర‌తీ ఏడాది నెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది.
UGC NET Result
UGC NET Result

యూజీసీ నెట్ ప‌రీక్ష‌ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు జ‌రిగింది. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మ‌రికొద్ది గంట‌ల్లో విడుద‌ల చేయ‌నుంది.

చ‌ద‌వండి: CSIR-UGC NET 2023 Notification: సైన్స్‌లో బోధన, పరిశోధనలకు మార్గం
ఫ‌లితాల కోసం 8 ల‌క్ష‌ల మంది ఎదురుచూపు

దేశ‌వ్యాప్తంగా 186 నగరాల్లో ఐదు దశల్లో జరిగిన ఈ పరీక్షకు 8.34 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 23న ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ఏప్రిల్ 6న ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ugcnet.nta.nic.in అధికారిక వెబ్సైట్లలో తమ ఫలితాలను పరిశీలించుకోవ‌చ్చు. స్కోర్ కార్డులను చెక్ చేసుకునేందుకు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు న‌మోదు చేయాలి. 

చ‌ద‌వండి:​​​​​​​ జాగ్ర‌త్త ప‌డ‌కుంటే అంతే.... భారీగా పెరుగుతున్న క‌రోనా మ‌ర‌ణాలు
ఫ‌లితాల‌ను ఇలా చెక్ చేసుకోండి
- ugcnet.nta.nic.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- యూజీసీ నెట్ డిసెంబర్ 2022 రిజల్ట్ లింక్ క్లిక్ చేయండి.
- మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ని న‌మోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.
- మీ స్కోర్ కార్డ్ చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోండి
- రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకుని కాపీ ఉంచుకోవాలి.

Published date : 10 Apr 2023 05:29PM

Photo Stories