Skip to main content

CSIR-UGC NET 2023 Notification: సైన్స్‌లో బోధన, పరిశోధనలకు మార్గం.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌! ఇది కేంద్ర విద్యాశాఖ పరిధిలోని.. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌), యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌).. సంయుక్తంగా నిర్వహించే పరీక్ష!! ఇందులో అర్హత సాధిస్తే పీహెచ్‌డీలో చేరే అవకాశంతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. దీంతోపాటు బోధన రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తాజాగా సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌–డిసెంబర్‌ 2022, జూన్‌–2023లకు ఉమ్మడి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, విజయం సాధిస్తే లభించే ప్రయోజనాలు తదితర వివరాలు..
CSIR-UGC NET 2023 Notification
  • సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2022/జూన్‌ 2023 ప్రకటన
  • ఈ స్కోర్‌తో జేఆర్‌ఎఫ్, లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అర్హత
  • బ్యాచిలర్, పీజీ ఉతీర్ణులకు దరఖాస్తుకు అవకాశం

సైన్స్‌ పరిశోధనలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. బోధన రంగంలో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకే సమయంలో ఈ రెండు అవకాశాల­ను అందుకునేందుకు మార్గం.. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన కేంద్రాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పరిశోధన సంస్థల్లో.. పీహెచ్‌డీ చేసేందుకు జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో) లభిస్తుంది. అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి లెక్చర్‌షిప్‌ లేదా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ పేరుతో అర్హత లభిస్తుంది. కెమికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌; లైఫ్‌ సైన్సెస్‌; మ్యాథమెటికల్‌ సైన్సెస్‌; ఫిజికల్‌ సైన్సెస్‌.. ఇలా ఐదు విభాగాల్లో సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ను నిర్వహిస్తున్నారు.

చ‌ద‌వండి: Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!

అర్హతలు

  • కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌–ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్,బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్, బీఎస్సీ ఆనర్స్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్‌ కేటగిరీ విద్యార్థులు సంబంధిత కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బీఎస్సీ(హానర్స్‌) ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. కానీ ఫైనల్‌ విద్యార్థులు/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి అర్హత లేదు.
  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌లకు అర్హత లేదని పేర్కొన్నారు. 

వయసు

  • జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు వయసు జూలై 1, 2022 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ వర్గాల వారికి అయిదేళ్లు, ఓబీసీ వర్గాల వారికి మూ­డేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. లెక్చర్‌షిప్,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి నిబంధన లేదు.

జేఆర్‌ఎఫ్‌/అసిప్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌

  • సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ద్వారా పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం కల్పించే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) లభిస్తుంది. అదే విధంగా కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు వీలు­గా లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ ప్రాధాన్యం జేఆర్‌ఎఫ్‌ లేదా లెక్చర్‌షిప్‌ తెలియజేయాలి. 
  • ఫలితాల వెల్లడి సందర్భంగా జేఆర్‌ఎఫ్‌ మెరిట్‌ లిస్ట్, లెక్చర్‌షిప్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ మెరిట్‌ లిస్ట్‌ పేరుతో రెండు జాబితాలను విడుదల చేస్తారు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి పరిశోధన లేబొరేటరీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలలో పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది. లెక్చర్‌షిప్‌ పొందిన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం–కళాశాలల్లో అధ్యాపకులుగా చేరేందుకు ఆమోదం లభిస్తుంది.
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే తొలి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున ఫెలోషిప్‌; ఆ తర్వాత మూడేళ్లు నెలకు రూ.35వేల ఎస్‌ఆర్‌ఎఫ్‌(సీనియర్‌ ఫెలోషిప్‌) అందుతుంది. 
  • యూజీసీ మార్గదర్శకాల ప్రకారం–ఉన్నత విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాల్లో సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత ప్రామాణికం.

చ‌ద‌వండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు..

పరీక్ష మూడు విభాగాలుగా

సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ పరీక్ష.. ఐదు సబ్జెక్టుల్లో మూడు విభాగాల్లో మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. మొత్తం మార్కులు రెండు వందలు. వివరాలు..

కెమికల్‌ సైన్సెస్‌

పార్ట్‌ సబ్జెక్ట్‌  ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 20 2 30
బి సబ్జెక్ట్‌ పేపర్‌ 40 2 70
సి సబ్జెక్ట్‌ పేపర్‌–2 60 4 100

(పార్ట్‌–ఎలో 15 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 35 ప్రశ్న­లు, పార్ట్‌–సిలో 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి)

ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓసియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌

పార్ట్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 20 2 30
బి సబ్జెక్ట్‌ పేపర్‌ 50 2 70
సి సబ్జెక్ట్‌ పేపర్‌–2  80 4 100

(పార్ట్‌–ఎలో 15 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 35 ప్రశ్నలు, పార్ట్‌–సిలో 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి)

లైఫ్‌ సైన్సెస్‌

పార్ట్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 20 2 30
బి సబ్జెక్ట్‌ పేపర్‌ 50 2 70
సి సబ్జెక్ట్‌ పేపర్‌–2 75 4 100

(పార్ట్‌–ఎలో 15 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 35 ప్రశ్నలు, పార్ట్‌–సిలో 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి)

మ్యాథమెటికల్‌ సైన్సెస్‌

పార్ట్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 20 2 30
బి సబ్జెక్ట్‌ పేపర్‌ 40 3 75
సి సబ్జెక్ట్‌ పేపర్‌–2 60 4.75 95

(పార్ట్‌–ఎలో 15 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 25 ప్రశ్నలు, పార్ట్‌–సిలో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి)

ఫిజికల్‌ సైన్సెస్‌

పార్ట్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 20 2 30
బి సబ్జెక్ట్‌ పేపర్‌ 25 3.5 70
సి సబ్జెక్ట్‌ పేపర్‌–2 30 5 100

(పార్ట్‌–ఎలో 15 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 20 ప్రశ్నలు, పార్ట్‌–సిలో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి)

చ‌ద‌వండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!

విజయం సాధించాలంటే
పార్ట్‌–ఎ

ఇది అయిదు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడి విభాగం. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. తార్కిక విశ్లేషణ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, పజిల్స్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా బేసిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌/కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.

పార్ట్‌–బి

ఈ విభాగంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇవి పూర్తిగా మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయడం, అన్వయ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఇందులో మార్కులు పొందొచ్చు.

పార్ట్‌–సి

ఈ విభాగంలోనూ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ సంబంధిత ప్రశ్నలే ఉంటాయి. వీటి క్లిష్టత స్థాయి అధికంగా ఉంటుంది. అభ్యర్థుల్లోని శాస్త్రీయ భావనలపై అవగాహన, శాస్త్రీయ భావనలను అన్వయించే నైపుణ్యాలను పరీక్షిస్తారు. పూర్తిగా విశ్లేషణాత్మక దృక్పథంతో సమాధానాలను గుర్తించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి.

పీజీ స్థాయి అవగాహన

సీఎస్‌ఐఆర్‌–యూజీసీ అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. పార్ట్‌–సిలో రాణించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. పార్ట్‌–ఎలో అడిగే జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి కూడా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తాజా పరిశోధనలు, వాటి ఫలితాలు, సంబంధిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 10, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: ఏప్రిల్‌ 12–18, 2023
  • సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ తేదీలు: జూన్‌ 6, 7, 8, 2023
  • వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in
Published date : 22 Mar 2023 07:29PM

Photo Stories