TS Eamcet Bipc Counselling : ఫార్మా కోర్సుల్లో 8,909 సీట్ల భర్తీ.. సీట్లు పొందిన అభ్యర్థులు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఎంసెట్ (బైపీసీ) తొలి విడత సీట్ల కేటాయింపు నవంబర్ 8వ తేదీన (మంగళవారం) పూర్తయింది. బీ ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో 8,909 సీట్లు కేటాయించినట్టు తెలంగాణ సాంకేతిక విద్యావిభాగం పేర్కొంది.

బైపీసీ ఎంసెట్ విభాగంలో మొత్తం 71,166 మంది అర్హత పొందారని, 17,999 మంది 4,32,746 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. అన్ని విభాగాల్లో మొత్తం 9,062 సీట్లు అందుబాటులో ఉంటే, తొలి విడత 8,909 సీట్లు కేటాయించినట్టు, ఇంకా 153 సీట్లు మిగిలిపోయినట్టు తెలిపింది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేసింది.
Published date : 09 Nov 2022 07:21PM