Skip to main content

DOST: మొద‌టి విడ‌త సీట్ల కేటాయింపు పూర్తి... కామ‌ర్స్ వైపే విద్యార్థుల చూపు

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. మొదటి విడతలో 73,220 మంది విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయించారు.

అత్య‌ధిక మంది విద్యార్థులు కామర్స్‌వైపే మొగ్గు చూపారు. కామర్స్‌లో 33,251(45.41%) మంది, లైఫ్ సైన్సెస్‌లో 16,434 (22.44శాతం) మంది చేరారు. డిగ్రీలో చేరేందుకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇప్పటివరకు అమ్మాయిలకు 44,113 సీట్లు, అబ్బాయిలకు 29,107 సీట్లు కేటాయించారు. 

ట్యూష‌న్లు చెప్ప‌డంతో ప్రారంభించి... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ... వేల కోట్లకు అధిపతైన‌ అలఖ్ పాండే స‌క్సెస్ జ‌ర్నీ

dost

మొద‌టి విడ‌త కౌన్సెలింగ్‌లో ఏ ఒక్క విద్యార్థి చేర‌ని డిగ్రీ క‌ళాశాల‌లు 63 ఉన్నాయి. జూన్‌ 16 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించ‌నున్నారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. జులై 1 నుంచి 6 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నిర్వ‌హిస్తారు.

జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.

dost

ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా..

దోస్త్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తారు. 1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు. దోస్త్ వెబ్ సైట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

Published date : 16 Jun 2023 05:40PM

Photo Stories