TS Schools Holidays : తెలంగాణలోని ఈ జిల్లాలో స్కూల్స్ బంద్.. ఎందుకంటే..?
రెండు రోజులుగా వికారాబాద్, పూడూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. మూసీవాగు, కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కందవాడలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో సగటున 4.95 సెం.మీ. నమోదైంది. ప్రధాన ప్రాజెక్టులు శివసాగర్, నందివాగు, జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిండి అలుగు పారుతున్నాయి. తాండూరుకు అన్ని వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి.
TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..
విద్యాసంస్థలు అన్నింటికీ..
కలెక్టర్ కార్యాలయం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. కాగా, భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలు అన్నింటికీ కలెక్టర్ నిఖిల జూలై 27వ తేదీన (బుధవారం) సెలవు ప్రకటించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల పంటపొలాలు, ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది.
Schools Holidays : మూడు రోజులు పాటు పాఠశాలలు సెలవులు.. కారణం ఇదే..
ఇటీవలే తెలంగాణలో విద్యా సంస్థలకు..
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో 3 రోజులు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. భారీ వర్షాలుండటంతో 3 రోజులు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం జూలై 10న ప్రకటించింది. జూలై 14 నుంచి విద్యాసంస్థలు తెరవాల్సి ఉంది. కానీ మరో 3 రోజులు వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పరిస్థితిని సమీక్షించిన అధికారులు 14 నుంచి 16 వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 17వ తేదీ ఆదివారం సెలవు కావడంతో విద్యా సంస్థలు 18న పునఃప్రారంభం అయిన విషయం తెల్సిందే.
Tenth and Inter: ఫెయిలైన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ అవకాశం