Skip to main content

Telangana Dasara Holidays 2022 : దసరా సెలవుల కుదింపుపై విద్యాశాఖ ఇచ్చిన‌ క్లారిటీ ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది.

కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సెప్టెంబ‌ర్ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలల పునఃప్రారంభమవుతాయని పేర్కొంది.

➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల..

Holidays

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌–ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి మంగళవారం.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.

AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణ‌లో మాత్రం..

సిలబస్ పూర్తి కాదనే కోణంలో..

holidays


సెల‌వులను త‌గ్గించాల‌నే ఆలోచ‌న రావ‌డానికి ప్రధాన కారణం ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటమే. గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది సిలబస్‌పై పడినట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందట. అందుకే దసరా సెలవులను ఆయా తరగతులకు కుదించాలని చూస్తున్నట్లు సమాచారం.

➤ Dussehra Holidays : ద‌స‌రా పండుగకు 22 రోజులు సెల‌వులు.. ఇక స్కూల్స్‌, కాలేజీ పిల్ల‌లకు అయితే..

ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..?

AP Schools


ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు స్కూల్స్‌కు ద‌స‌రా సెల‌వులు రానున్నాయి. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో ముందుగా ద‌స‌రా సెల‌వుల గురించి ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ మేర‌కే ద‌స‌రా సెల‌వులను ఏపీ విద్యాశాఖ ప్ర‌క‌టించింది.

Published date : 21 Sep 2022 03:41PM

Photo Stories