National Award for Teachers: ఉపాధ్యాయులు అందించిన సేవలకు అవార్డులు ప్రదానం
సాక్షి ఎడ్యుకేషన్: కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు వరించాయి. మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించినవారికి అవార్డులు ప్రదానం చేశారు. విద్యా రంగానికి సంబంధించి కోడూరు మండలంలోని యర్రారెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన బొంతు నాగరాజుకు ఉపాధ్యాయరత్న జాతీయ అవార్డు లభించింది.
➤ Andhra Pradesh Govt Schools: ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం
నాగరాజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంట్రీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అలాగే నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో బయిలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొమ్మినేని ఉదయకుమార్ వరల్డ్ టీచర్స్ డే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. హైదరాబాద్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రిటైర్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.చంద్రయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్.కె.జైస్వాల్, సన్‌షైన్ హాస్పిటల్స్ ఫౌండర్ ఏవీ గురవారెడ్డి ఈ అవార్డులను ఉపాధ్యాయులకు అందించారు.