Skip to main content

Retirement Age Clarity : ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు మార్పుపై కేంద్రం క్లారిటీ.. ఇక‌పై..!

Central government clarity on retirement age

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌తి కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ఉంటుంది. వారి వ‌య‌సు 60 సంవ‌త్స‌రాలు దాట‌గానే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారు. అయితే, గ‌త కొద్దిరోజులుగా ఈ వ‌య‌స్సును పెంచేసారు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాని, వ‌య‌సును పెంచ‌డం లేదా మార్చ‌డం వంటి ప్ర‌తిపాద‌న‌లు వంటివి ఏమీ లేవ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Indian Navy Day: డిసెంబర్ 4వ తేదీ ఇండియన్ నేవీ డే.. ఈ ఏడాది థీమ్ ఇదే..

బుధ‌వారం జ‌రిగిన లోక్‌సభ స‌మావేశంలో కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధ‌నం లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చారు. ఆ స‌మాధానాల్లో ఈ క్లారిటీ కూడా ఒక‌టి. దీంతో కేంద్ర ఉద్యోగుల వ‌య‌సు అదే 60 ఏళ్ల‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

కేంద్ర రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొన‌సాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి. ప్ర‌భుత్వం వారికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలను అందించేందుకు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించేందుకు కృషి చేస్తోందన్నారు.

2025 Year labor holidays: 2025వ సంవత్సరంలో కార్మిక సెలవులు ఇవే..

కేంద్రంలోని మంత్రిత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను స‌మ‌యానుసారం భ‌ర్తీ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని, ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నామన్నారు. రోజ్‌గార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా, ఆరోగ్య రంగాల్లోని ఖాళీల‌ను మిష‌న్ మోడ్‌లో భ‌ర్తీ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగున్నాయ‌న్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 12:36PM

Photo Stories