Education Chief Secretary: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అదికారిని నియమిస్తు ఉత్తర్వులు జారీ
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో వెంకటేశం స్థానంలో ఎన్.శ్రీధర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు.
చదవండి: RRC Apprentice Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్‌లో 1,791 యాక్ట్ అప్రెంటిస్‌లు
మొదట రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్‌గా కాకినాడలో పని చేశారు. అనంతరం అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రెటరీగా మూడేళ్ల మూడు నెలల పాటు పని చేశారు.
తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ స్థానంలో బలరామ్‌ను సీఎండీగా నియమించిన విషయం తెలిసిందే.