Skip to main content

TS Teacher Jobs Recruitment: త్వరలో 13వేల టీచర్‌ పోస్టుల భర్తీ.. వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి

Notebooks and uniform distribution to students  Anganwadi center mass literacy session Teacher Jobs Recruitment  Minister Komatireddy Venkatreddy at Badibata Ka program

నార్కట్‌పల్లి: త్వరలోనే 13,000 కొత్త టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫాం అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు.

అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పా రు. నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల–ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీళ్లు నింపి డిసెంబర్‌లోపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభిస్తామన్నారు.

TS ICET 2024 Results Declared: ఐసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి.. టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే..

కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్‌ ఈఈ బీమన్న, డీఈ మహేశ్, ఉదయ సముద్రం ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Published date : 15 Jun 2024 01:05PM

Photo Stories