Skip to main content

Spot Admissions: రేపు గురుకుల పాఠశాలల్లో స్పాట్‌ అడ్మీషన్స్‌

Spot Admissions in Gurukula schools

చిట్యాల: వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని (హనుమకొండ, వరంగల్‌, ములుగు, భూపాలపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (బాలుర, బాలికలు) 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 12న మడికొండ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు స్థానిక బాలికల గురుకుల ప్రిన్సిపాల్‌, డీసీఓ (జిల్లా గురుకులాల కో–ఆర్డినేటర్‌) గోల్కొండ భిక్షపతి  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Job Mela: యువతకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

ఆసక్తి గల తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని అన్నారు. కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌, స్టడీ సర్టిఫికెట్లు తీసుకొని రావాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. అనంతరం స్పాట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 11 Sep 2024 04:18PM

Photo Stories