SSLC Exams: తొలిరోజు సాఫీగా సాగిన పదో తరగతి బోర్డు పరీక్షలు
బనశంకరి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది లాంటి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలు సోమవారం నుంచి రాష్ట్రమంతటా ప్రారంభమయ్యాయి. 2,750 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి రోజు పరీక్ష ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగింది.
Degree Admissions: గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
8.69 లక్షల మంది
ఈ ఏడాది 4,41,910 మంది బాలికలు, 4,28,058 మంది బాలురతో కలిపి మొత్తం 8,69,968 పరీక్షలు రాస్తున్నారు. 18,225 మంది ప్రైవేటు విద్యార్థులు, 41,375 మంది ఫెయిలైన విద్యార్థులు, 5424 మంది ప్రత్యేక బాలలు కూడా హాజరయ్యారు. కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, ఉర్దూ , మరాఠీ మీడియంలో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
Australian Grand Prix: ఫార్ములావన్ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు నిరాశ, సెయింజ్‌కు విజయం
పకడ్బందీ చర్యలు
కాపీయింగ్ అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, సిబ్బంది కూడా మొబైల్‌ఫోన్లు తేకుండా నిషేధించారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్లలో గుంపులుగా ఉండకుండా విధించారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చారు. విద్యాశాఖ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులను జిల్లాల్లో పరిశీలకులుగా నియమించారు.
ఫెయిల్ అయితే రెండు చాన్సులు
ఈసారి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఇదే ఏడాది రెండుసార్లు పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించారు. వార్షిక పరీక్ష 1, 2, 3 పరీక్షలను రాసిన విద్యార్థులు ఏ పరీక్షలో గరిష్ట మార్కులు పొందితే వాటినే ఎంపిక చేస్తారు.
Vidyadeevena: విద్యాదీవెనతో ముగ్గురు పిల్లల చదువు..
5, 8, 9 క్లాసులకు బోర్డు పరీక్షలు
స్టేట్ సిలబస్ కలిగిన 5, 8, 9 తరగతులకు పబ్లిక్ (బోర్డు) పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యాయి. బోర్డు పరీక్ష గురించి రూప్సా, ప్రభుత్వం మధ్య తగాదా తలెత్తగా వాదనలు ఆలకించిన హైకోర్టు సర్కారుకు మద్దతుగా బోర్డు పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపింది. సోమవారం నుంచి 5, 8, 9 పరీక్షలు ఆరంభమయ్యాయి.