Skip to main content

Schools and Colleges Tomorrow Closed : రేపు, ఎల్లుండి స్కూల్స్‌, కాలేజీల‌కు బంద్‌.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నవంబర్‌ 30న(గురవారం) పోలింగ్‌ జరగనుంది.
School and College Holidays  for Telangana Elections , Assembly Elections in Telangana, Schools and Colleges Tomorrow Closed News in Telugu, Assembly Elections in Telangana on November 30,

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

☛ School Holidays List December 2023 : స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు.. బ్యాంకులకు 14 రోజులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి. ఇక, మళ్లీ డిసెంబర్‌ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా సమాచారం ఇచ్చారు.

 School and Colleges 2024 Holidays List : వ‌చ్చే ఏడాది 2024లో స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఇవే.. ఎక్కువ హాలిడేస్‌ ఈ నెల‌లోనే..

డిసెంబరు 3వ తేదీ కూడా..
డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని సీఎస్ శాంతికుమారి అక్టోబ‌ర్ 16వ తేదీన (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవుదినంగా ఉంటుంద‌న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 28 Nov 2023 02:58PM

Photo Stories