Skip to main content

School Student : విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం!

ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో ఈ విద్యార్థిని ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది..
School student stands first position in poster making at national competition

బాపట్ల: సృజనాత్మకతను గుర్తిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టిన పదో తరగతి విద్యార్థిని భవ్యశ్రీని జిల్లా కలెక్టర్‌ సోమవారం అభినందించారు. ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పోస్టర్‌ ప్రజెంటేషన్‌ కాంపిటీషన్‌లో జిల్లా విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించింది.

ICC Awards: ఐసీసీ అవార్డులో స‌త్తాచాటిన శ్రీలంక ప్లేయ‌ర్స్.. వీరే!

బాపట్ల జిల్లా కొండమంజులూరు హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పంచుమర్తి భవ్యశ్రీ రూపొందించిన పోస్టర్‌ ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని భవ్యశ్రీకి స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో రూ.10వేల నగదు పారితోషకాన్ని చెక్కు రూపంలో కలెక్టర్‌ అందజేశారు. విద్యార్థినికి జ్ఞాపికతోపాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

National Skill Development : నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సౌజన్యంతో ప‌ది రోజుల‌ శిక్ష‌ణ‌.. ఈ విభాగాల్లో..!

పాఠశాల హెచ్‌ఎం ఐ.అనిత, డ్రాయింగ్‌ టీచర్‌ టి.వెంకటేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. డీఈఓ కె.నారాయణరావు, జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి డి.ప్రసాదరావు, జిల్లా సైన్స్‌ అధికారి మహమ్మద్‌ సాదిక్‌, సైన్స్‌ కో–ఆర్డినేటర్‌ పవని భానుచంద్రమూర్తి, సికిందర్‌ మీర్జాన్‌, రామకోటిరెడ్డి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Published date : 17 Sep 2024 01:47PM

Photo Stories