Scholarship Program: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ‘కెనరా’ ఉపకార వేతనాలు
విశాఖ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఆరుగురు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెనరా బ్యాంక్ రూ.24 వేలు చొప్పున ఉపకార వేతనాలు అందించింది. కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ‘కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేడ్కర్ విద్యా జ్యోతి స్కాలర్‌షిప్ స్కీమ్’ కింద శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు విశాఖ ఏజీఎం ఎన్.మధుసూధన్‌రెడ్డి తెలిపారు.
EAPCET Final Phase Of Counselling: ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
విద్యార్థి దశ నుంచే చదువుపై ఇష్టం పెంచుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. 11 ఏళ్లుగా ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవలో కెనరా బ్యాంక్ ముందుంటుందని, భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇతర దేశాల్లో చదువుకునే వారికి విద్యా రుణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి కె.రాజేశ్వరి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వి.నాగశిరీష, పలు పాఠశాలల హెచ్‌ఎంలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.