Sankranthi Holidays 2023 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం.. మొత్తం ఎన్ని రోజులంటే..?
జనవరి 18వ తేదీన (బుధవారం) పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. జనవరి14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. తెలంగాణ జూనియర్ కాలేజీలకు కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 16న కనుమ పండుగ ఉండగా.. అదేరోజు కాలేజీలు తెరచుకోనున్నాయి.
➤ వచ్చే ఏడాది 2023లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే.. ఈ సారి ఉద్యోగులకు మాత్రం..
ఏపీలో మాత్రం..
ఈ ఏడాది ప్రకటించిన అకడమిక్ సెలవుల క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవుల్ని జనవరి 11 నుంచి 16 వరకూ ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. అయితే సంక్రాంతి సెలవుల్లో మార్పుకు సంబంధించి ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. జనవరి 17వ తేదీ ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని 12 నుంచి 18వ తేదీకి మార్పు చేశారు. 19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన వారిలో ఉంది.