Guru Nanak College: గురునానక్ కళాశాల వద్ద ఉద్రిక్తత... ప్రశ్నార్థకంగా 4 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు...!
![Guru Nanak University](/sites/default/files/images/2023/06/23/gurunanak-1687515945.jpg)
కళాశాలకు యూనివర్సిటీ అనమతులు లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాలేజీలో కోర్సుల కోసం లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి.. ఇప్పుడు అనుమతి లేదంటూ యాజమాన్యం చేతులెత్తేయటంపై ఆగ్రహంతో రగిలిపోయారు స్టూడెంట్స్. గురువారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాలకు ప్రైవేటు విశ్వవిద్యాలయం హోదా రాకున్నా 4 వేల మంది విద్యార్థులను చేర్చుకుని 6 నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
చదవండి: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్–2 పరీక్షలపై విజయనగరంలో ఉచిత అవగాహన సదస్సు
![Guru Nanak University](/sites/default/files/inline-images/06ibr02-640023_mr.jpg)
అడ్మిషన్ల సమయంలో జూన్ 20లోగా అనుమతులొస్తున్నాయని చెప్పారని.. ఇప్పుడేమో అనుమతులు రాకపోవడంతో చేతులెత్తేశారని ఆవేతన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిలదీయడంతో సర్టిఫికెట్లు ఇచ్చేస్తామని, లేదంటే ఇతర వర్సిటీలకు బదిలీ చేస్తామని చెబుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
చదవండి: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్–2 పరీక్షలపై.. కాకినాడలో ఉచిత అవగాహన సదస్సు
విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీ, వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. వారికి న్యాయం చేసేవరకు కాలేజీ నుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. కొందరు విద్యార్థులు కాలేజీలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనతో మరింత ఆగ్రహానికి గురైన విద్యార్థులు కళాశాల లోపలికి వెళ్లి అద్దాలను పగులగొట్టారు.
![Guru Nanak University](/sites/default/files/inline-images/gurunanak%20college.jpg)
కూలర్లు, గదుల్లోని ఫర్నీచర్‌ని విరగ్గొట్టారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మరింతమంది పోలీసులు వచ్చి విద్యార్థులను చెదరగొట్టారు. తమను మోసం చేసినందుకు కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మరో వారంపాటు ఓపిక పట్టాలని విద్యార్థులకు, తల్లిదండ్రులను గురునానక్ కళాశాల వైస్ చైర్మన్ కోహ్లీ కోరారు.
చదవండి: టైటానిక్ కోసం సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
తమ కాలేజీకి విశ్వవిద్యాలయ అనుమతులు రానిపక్షంలో అరోరా, మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీల కళాశాలలకు విద్యార్థులను బదిలీ చేస్తామని, అవసరమైతే ధ్రువపత్రాలు, ఫీజులు తిరిగిస్తామని కోహ్లీ వివరించారు.