Skip to main content

Missing Titan Submarine Found : టైటానిక్ కోసం సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు

అట్లాంటిక్‌ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన‌ ఐదుగురు సాహ‌స యాత్రికులు ప్ర‌యానం విషాదాంతంతో ముగిసింది.
titan submarine
titan submarine

టైటాన్‌ అనే మినీ సబ్‌మెరిన్‌లో వీక్షణకు బయల్దేరి సముద్ర గర్భంలోనే కలిపిపోయారు. దాదాపు ఐదురోజులపాటు జాడ లేకుండా పోయిన టైటాన్‌ శకలాలను రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌(ROV) గుర్తించ‌గా ఈ సాహ‌స యాత్ర విషాదంగా ముగిసింది.  
కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్‌’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్‌ ప్రిన్స్‌ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే  అమెరికా తీర రక్షణ దళం దృష్టికి యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్ తీసుకెళ్లింది. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్‌ అదృశ్యమై ఉంటుందని భావించిన‌ కోస్ట్‌గార్డ్‌,  అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్‌ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.

   Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...
ఎలా జ‌రిగింది:
నీటి అడుగుకు వెళ్లే క్రమంలో ఛాంబర్‌లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్‌ పేలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టైటాన్ విశేషాలు:
వాషింగ్టన్‌ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఓషన్‌గేట్, 2021 నుంచి టైటాన్‌ అనే సబ్‌ మెర్సిబుల్‌ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. 2009లో స్టాక్‌టన్‌ రష్‌, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు.  నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. టైటాన్‌లో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, ఒక నిపుణుడు మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ టైటాన్‌ దాదాపు 6.5 మీటర్ల పొడవు,10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. ఈ మినీ సబ్‌మెరిన్ 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.కార్బన్‌, టైటానియం కలయికతో ఈ టైటాన్నినిర్మించారు.

   Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే..

ఎవ‌ర‌వ‌రు వెళ్లారు:
బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్‌ ఏవియేషన్స్‌ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కూడా సాధించారు.నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. 

బ్రిటిష్‌-పాకిస్థానీ బిలియనీర్‌ షాజాదా దావూద్‌(48), ఆయన కుమారుడు సులేమాన్‌(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా కరాచీలో పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్‌ ఛైర్మన్‌. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. 

ఓషన్‌గేట్‌ సహవ్యవస్థాపకుడు ట్రైనింగ్‌ పైలట్‌ అయిన రష్ నిపుణుడి హోదాలో ఈ బృందంతో వెళ్లారు.
ఫ్రెంచ్ సబ్‌మెర్సిబుల్ పైలట్‌  పాల్‌ హెన్రీ నార్జిలెట్ కి నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అ‍త్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు.  నావికుడిగా పాతికేళ్ల అనుభవం ఉంది. 

☛  Daily Current Affairs in short : 21 జూన్‌ 2023 కరెంట్‌ అఫైర్స్‌ ఇవే

Published date : 23 Jun 2023 03:45PM

Photo Stories