Pakistani Intelligence: ఈ నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తే జర జాగ్రత్త.... విద్యార్థులే లక్ష్యంగా పాకిస్తాన్ కుయుక్తులు
ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన ఆర్మీ వర్గాలు విద్యార్థులను అలర్ట్ చేశాయి.
దేశంలో పేరు ప్రఖ్యాతలున్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఆర్మీలో పనిచేసే జవాన్లు, అధికారుల పిల్లలు ఎక్కువశాతం మంది ఈ స్కూల్స్‌లోనే చదువుకుంటుంటారు. దీంతో వీరిని ఈజీగా పాకిస్తాన్ టార్గెట్ చేసింది.
ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు 8617321715, 9622262167 నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, అనుమానస్పద సందేశాలు వస్తున్నాయి. పాఠశాల టీచర్లలాగే మాట్లాడుతూ విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. కొత్తగా వాట్సప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి విద్యార్థులు అందులో జాయిన్ అవ్వాల్సిందిగా సూచిస్తున్నారు.
1.25-crore salary package: అదరగొట్టిన ఐఐఐటీ విద్యార్థి... కోటి 25 లక్షల ప్యాకేజీతో శభాష్ అనిపించిన అనురాగ్
వాట్సప్ గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత విద్యార్థులకు తియ్యని మాటలు చెప్పి, వారిని మచ్చిక చేసుకుని వారి తల్లిదండ్రుల వివరాలు, వారి గుర్తులు, ఆర్మీలో ఏ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు... ఇలాంటి వివరాలను రాబడుతున్నారు.
*రెండు మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి విద్యార్థులకు కాల్స్, వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి. స్కూల్ టీచర్లుగా నటిస్తూ.. విద్యార్థులను కొత్త తరగతి గ్రూపుల్లో చేరమని ప్రోత్సహిస్తున్నారు. వన్ టైమ్ పాస్ వర్డ్ లను పంపి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గ్రూపుల్లో చేరిన తర్వాత సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నారు* అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: జూలై 29, 30 తేదీల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఎందుకంటే..?
అనుమానిత పీఐవోలు తొలుత విద్యార్థులకు తెలిసిన అంశాలను ప్రస్తావిస్తూ ఫోన్లు చేసి సందేశాలు పంపి తమ ఉపాధ్యాయులే తమను సంప్రదిస్తున్నారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు జారీ చేసిన నోటిస్ ప్రకారం... పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ విద్యార్థులను వారి తండ్రి ఉద్యోగం, పాఠశాల దినచర్య, సమయాలు, ఉపాధ్యాయుల పేర్లు, యూనిఫాం వంటి వివరాలను అడుగుతున్నారు.
ఇవీ చదవండి: ఉద్యోగం మారిన విషయాన్ని పీఎఫ్ ఖాతాలో నమోదుచేయట్లేదా.... అయితే మీకు తిప్పలు తప్పవు..!
దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆర్మీ కోరింది. ఇవే నంబర్ల నుంచి కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా సందేశాలు రావచ్చని, వ్యవహార శైలి కూడా మారవచ్చని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలని కోరింది.