Open University Admissions: ఓపెన్ వర్సిటీ ప్రవేశాలకు గడువు పెంపు
Sakshi Education
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్‌సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీ పొడిగించినట్లు వర్సిటీ రీజినల్ కో–ఆర్డినేటర్ వీఏఎన్ సతీష్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 20వ తేదీ వరకూ గడువు పొడిగించారని, అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని పే ర్కొన్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లించడానికి సైతం గడువు తేదీని అక్టోబర్ 20 వరకూ పొడిగించారని సతీష్ తెలిపారు.
చదవండి: Jobs in Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు
Published date : 07 Oct 2023 03:10PM