Occupation Courses: దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సుల ప్రవేశాలు..
Sakshi Education
స్త్రీలకు పురుషులకు వారి వారి రంగాల్లో వృత్తివిద్యా కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఇన్‌చార్జి ప్రకటించారు. అర్హులు, ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Vocational Courses for Men and Women

సాక్షి ఎడ్యుకేషన్: జీవీఎంసీ తొమ్మిదో వార్డు పరిధి విశాలాక్షినగర్ దయాల్‌నగర్‌లో దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఇన్‌చార్జి దక్షిణామూర్తి ఆదివారం తెలిపారు.
Sports Competitions: హ్యాండ్‌బాల్ ఎంపికలకు పోటీలు
డ్రెస్ డిజైనింగ్ అండ్ టైలరింగ్(స్త్రీలకు), టెక్స్ టైల్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ (స్త్రీలకు, పురుషులు), మోటార్ వెహికల్ మెకానిక్ టూ వీలర్, ఫోర్ వీలర్ (పురుషులు), ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కోర్సుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నామన్నారు. ఇవి ఏడాది కాలపరిమితి గల కోర్సులని, పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. వివరాలకు 9963340611 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
Published date : 09 Oct 2023 02:05PM