Skip to main content

Polytechnic College : క‌ళాశాల‌కు రిపోర్ట్ చేయ‌క‌పోతే సీటు పోయిన‌ట్టే..

No seat if students don't report to college

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలీసెట్‌–2024 కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలకు రిపోర్టు చేయాలి. లేదంటే సీటు కోల్పోతారు. రిపోర్టు చేసిన విద్యార్థులకు రెండో కౌన్సెలింగ్‌లో మార్పు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా, 2674 సీట్లకు 1427 ప్రవేశాలు జరిగాయి. త్వరలో సాంకేతిక విద్యాశాఖ రెండో విడత కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయనుంది. సీటు లభించిన విద్యార్థులు తప్పని సరిగా కళాశాలలకు రిపోర్టు చేయాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జి జి.దామోదర్‌రావు తెలిపారు.

ITI Counselling: 19, 20 తేదీల్లో ఐటీఐ కౌన్సెలింగ్‌.. ఆ సర్టిఫికేట్లతో హాజరు

Published date : 19 Jun 2024 09:44AM

Photo Stories