Skip to main content

NEET-UG Leak 2024: ‘నీట్‌’పై కేంద్రం, ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

NEET-UG examination  Central Government of India  NEET-UG Leak 2024  Justice Vikramanath and Justice Sandeep Mehta  National Testing Agency

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్‌–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్‌ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం విచారణ చేపట్టింది. 

NEET-UG Paper Leak: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి రియాక్షన్‌ ఇదే..

రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది.

Published date : 17 Jun 2024 10:49AM

Photo Stories