JRF: జేఆర్‌ఎఫ్‌లో వ్యవసాయ వర్సిటీ హ్యాట్రిక్
Sakshi Education
భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) జాతీయ స్థాయిలో నిర్వహించిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరుసగా మూడోసారి (2018, 2019, 2020) ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఢిల్లీలో సెప్టెవబర్ 28న జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో ఐసీఏఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ త్రిలోచన మహాపాత్ర దీనికి సంబంధించిన పత్రాలను, జ్ఞాపికలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా మూడు సార్లు ద్వితీయ స్థానంలో నిలిచి హ్యాట్రిక్ విజయం సాధించామని, భవిష్యత్‌లో మొదటిస్థానాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక వర్సిటీ పాలకవర్గ సభ్యులు, విద్యా విషయక మండలి సభ్యులు, అధ్యాపకమండలి, బోధన, బోధ నేతర సిబ్బంది, విద్యార్థుల సమష్టికృషి, భాగస్వా మ్యం ఉన్నాయని, ఈ విజయాన్ని విశ్వవిద్యాలయం సభ్యులందరికీ అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
చదవండి:
Published date : 29 Sep 2021 04:10PM