Community Science: కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలు..
Sakshi Education
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎస్సీ (హానర్స్) సమాజ విజ్ఞాన శాస్త్రం (కమ్యూనిటీ సైన్స్) కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధరకృష్ణ తెలిపారు.
సెప్టెంబర్ 18న గుంటూరు లాం ఫాంలోని కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల ఈ కోర్సులో మొత్తం 84 సీట్లు ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి డబ్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్ జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
చదవండి:
Published date : 20 Sep 2021 05:40PM