Skip to main content

Jagananna Vidyaa Deevena: ఒంగోలు జిల్లాలో 47,350 విద్యార్థులకు రూ.35 కోట్లు!

జిల్లాలో 47,350 మంది విద్యార్థులకు రూ.35 కోట్లకు పైగా ఆర్ధిక ప్రయోజనం.
Vidyaa Deevena in Ongole

ఒంగోలు అర్బన్‌: ఉన్నత చదువులు చదివేందుకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా నిలుస్తోందని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ కే శ్రీనివాసులు అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2022–23 విద్యా సంవత్సరంలో మూడో విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో సోమవారం జమ చేసే సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా జిల్లాలో ప్రకాశం భవనంలో కార్యక్రమం నిర్వహించారు.

AP EAPCET 2023 Category-B అడ్మిషన్స్: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే!

దీనిలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌తో పాటు మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకరావు ఇతర అధికారులు పాల్గొని అర్హులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మూడో విడతలో జిల్లాలో 47,350 మంది అర్హులైన విద్యార్థులకు రూ.35,39,96, 419ల ఆర్ధిక ప్రయోజనం కలిగిందని వివరించారు.

Multiplier AI: హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

వీరికి చెందిన 42,899 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో ఎస్‌సీలు 12,537, ఎస్‌టీలు 1,258, బీసీలు 15,860, ఈబీసీలు 11,800, ముస్లిం మైనార్టీలు 3,086, కాపులు 2,756, క్రైస్తవ మైనార్టీలు 53 మంది ఉన్నట్లు తెలిపారు. త్రైమాసికం ముగిసిన వెంటనే ఈ పథకం కింద కాలేజి ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నట్లు తెలిపారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఈ మూడు విడతల్లో కలిపి రూ.107,57,86,721 విడుదలైనట్లు చెప్పారు.

APPSC Group 1 Ranker: నా విజ‌యం వెనుక ఉన్న‌ది వీళ్లే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా..

ప్రభుత్వం చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నీ వర్గాల సంక్షేమమే వైఎస్‌ జగన్‌ లక్ష్యం అని అన్నారు. దీనిలో సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌, బీసీ సంక్షేమ అధికారి అంజల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Published date : 29 Aug 2023 04:10PM

Photo Stories