Skip to main content

Jagananna Vidya Devena Scheme: విద్యార్థులకు జగనన్న కానుక

రాయచోటి : విద్యా దీవెన.. విద్యార్థులకు వరం అని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి సభలో ‘జగనన్న విద్యా దీవెన పథకం’ కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాకు 2023 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన నగదు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
జగనన్న విద్యా దీవెన పథకం
జగనన్న విద్యా దీవెన పథకం

అనంతరం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.24.42 కోట్ల మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన కింద అర్హులైన 31,743 మంది విద్యార్థుల తల్లుల ఖాతాకు నగదు జమ చేశామని తెలిపారు. పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని విద్యా దీవెనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.

Also read: CM Jagan Disburses Funds for Jagananna Vidya Deevena Scheme at Nagari Meeting #sakshieducation

ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పించి తల్లుల సాధికారతకు పట్టం కడుతోందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధికారత అధికారి జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా బిసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప, వివిధ సంక్షేమ అధికారులు, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.

Also read:    Breaking News: Mobile Phones Banned in AP Schools by the AP Education Board #sakshieducation

జగనన్న విద్యా దీవెన కింద 2023 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన వివరాలు

  • అంశం మొత్తం అర్హులైన జమ చేసిన
  • విద్యార్థులు విద్యార్థులు మొత్తం(కోట్లలో)
  • ఎస్సీ సంక్షేమం 4,771 4,428 రూ.3.22
  • ఎస్టీ సంక్షేమం 1170 1068 రూ.0.85
  • బీసీ సంక్షేమం 13699 12308 రూ.9.39
  • ఈబీసీ 4398 4180 రూ.4.00
  • ముస్లిం మైనార్టీ 5167 4739 రూ.3.16
  • కాపు సంక్షేమం 5293 4960 రూ.3.73
  • క్రిస్టియన్‌ మైనార్టీ 70 60 రూ. 0.05
  • జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌
  • 31,743 మంది విద్యార్థుల తల్లుల ఖాతాకు రూ.24.42కోట్లు జమ

A Glimpse Inside: Girijana Sankshema Gurukula Patasala @ Maredumilli |Special Story #sakshieducation

Published date : 29 Aug 2023 05:50PM

Photo Stories